ఆచితూచి అడుగులు

AP,TS CMS' BABU, KCR
AP,TS CMS’ BABU, KCR

ఆచితూచి అడుగులు

ఫ్రంట్‌ను కూడగడుతూనే కేంద్రంతో సయోధ్య?
బిజెపితో ఎపి కొట్లాట, తెలంగాణకు లాభం!
దక్షిణాది, ఉత్తరాది తేడా లేకుండా కెసిఆర్‌ అడుగులు
ప్లీనరీ తర్వాత కెకె నేతృత్వంలో సంప్రదింపుల కమిటీ

వై.నాగేశ్వరరావు / హైదరాబాద్‌

టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నా, ఆయన అడు గుల్లో తొందరతనం లేదు. మరో వైపు కేంద్ర ప్రభుత్వంతో ఆచితూచే వ్యవహరిస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్‌లపై యుద్ధం ప్రకటించినా, బిజెపి, కాంగ్రేసేత పార్టీలను ఒక త్రాటిపైకి తెచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ను 2019 ఎన్నికల నాటికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పావులు కదుపు తున్నా, రాష్ట్రం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు.

తెలంగాణలో కావాల్సిన పనులకు కేంద్రంతో ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ‘ఫె¶డరల్‌ ఫ్రంట్‌ ఫ్రంటే, తెలంగాణ తెలంగాణే అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు.ఆంధ్రపదేశ్‌లో టిడిపి అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రాష్ట్రానికి ఎంతో కొంత నష్టం జరిగే అవ కాశాలు ఉన్నాయి.తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఏపిలో కొనసాగుతున్న బిజెపికి వ్యతిరేకత తెలంగాణలో అధికార పార్టీకి కలిసొచ్చింది. పైగా చంద్రబాబు ఉత్తరాది రాష్ట్రాల వల్ల దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు.

కానీ కెసిఆర్‌ ఆ వైఖరిని ఒప్పుకోవడ లేదు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు అనే తేడాచూపకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ను ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. 3,4 రోజుల క్రితం కేరళ లోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమా వేశం జరిగితే తెలంగాణ నుంచి ఆర్థిక ఆర్థిక మంత్రి ఈటెల రాజేం దర్‌ను వెళ్లనీయలేదు.ఆ సమావేశంలో కేంద్రం దక్షిణాధి రాష్ట్రాలపై ఆర్ధిక వివక్ష చూపుతుందని చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మం త్రుల సమావేశాలకు వెళ్లనందుకే కేంద్రం సూచన మేరకు ఆర్‌బిఐ తెలంగాణలో రైతు పెట్టుబడి పథకంఅమలుకోసం 2000కోట్ల నగదు ను అత్యవసరంగా కేటాయించిందని తెలుస్తోంది.

తాజాగా పార్లమెం ట్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి,వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానం తీసుకొస్తే, దానిపై చర్చ జరగకుండా సభలో ప్రతి రోజూ ఎఐడిఎంకె పార్టీతో టిఆర్‌ఎస్‌ కూడా ధర్నాలు చేయడం కూడా వ్యూహమే అంటున్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని టిఆర్‌ఎస్‌ ధర్నా చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు పూర్తిగా వృధా అయ్యాయి.ఈ వృధాకు కారణం విపక్షాల తీరేనని తప్పుపడుతూ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాతో పాటు బిజెపి నేతలంతా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. తెలంగాణలో టిఆర్‌ ఎస్‌కు కాంగ్రెస్‌ శత్రువు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పార్టీతో పాటు ఇప్పుడు బిజెపి కూడా.

దీంతో ఇప్పుడు చంద్రబాబు కెసిఆర్‌ తరహాలో జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థలపై మాట్లాడలేరు. ఢిల్లీ రాజకీ యాల్లో పలుసార్లు చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన అవసరం వచ్చింది. కెసిఆర్‌కు లోకల్‌ టెన్షన్‌ లేదు జాతీయ అంశాలను నెత్తిన పెట్టుకున్నారు. నాడు తెలంగాణ సాధన కోసం దేశంలోని ఏ పార్టీలు మద్దతు ఇచ్చా యో. ఏ పార్టీల నేతలు లేఖలు రాశారో వారందరినీ ఇప్పుడు కలుస్తు న్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దేవాలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నట్లుగానే, నాడు మద్దతు ఇచ్చిన నేతలందరినీ కలిసి తన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనలను పంచుకుంటున్నారు.సిఎం కెసిఆర్‌ దేశంలోని అన్ని ప్రాంతాలను,అని పార్టీలపై అవగాహన పెంచుకుని, బిజెపి,కాంగ్రేసేత పాలన జరిగితేనే దేశానికి మేలు జరుగుతుందన్న వాదన ముందుకు తెస్తున్నారు. 70 ఏళ్లుగా దేశానికి ఈ రెండు పార్టీల పాలన వల్ల ఏమీ ఒరగలేదని, నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని, రైతలకు న్యాయం జరగడం లేదని దీంతో దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు అవసరని చెబుతున్నారు.

ఈమేరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను దేశ ప్రజలందరికీ చెబుత న్నారు. కానీ టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇప్పుడు అన్నీ మాట్లాడితే కేంద్రంలోని బిజెపి అప్రమత్తమవుతుందనే ఆందోళన నెలకొంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌కు నష్టం చేయాలన్న లక్ష్యం కనిపించొద్దని, ఇప్పుడు దేశంలో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తు న్నట్లుగా పలు సంఘటనలు రుజువు చేస్తున్నందున మరింత స్పష్టత అవసరమంటున్నారు. భవిష్యత్‌తో కేంద్రంలో ఒకవేళ ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే టిఆర్‌ఎస్‌దే కీలక పాత్ర ఉండే వాతావరణం కావాలని కోరుతున్నారు. అందుకని ఇప్పటి నుంచే పెడరల్‌ ప్రంట్‌ కోసం యత్నాలు చేయకుండా 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి అడుగులు వేయవచ్చుగా అభిప్రాయపడుతున్నారు.