ఆగని అల్లర్లు

TUTUKODI
TUTUKODI

తూత్తుకుడి: స్టెరిలైట్‌ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ నిర్వహిస్తున్న పతాకస్థాయి ఆందోళనలో రెండోరోజు కూడా పోలీసు కాల్పులు జరిగాయి. ఆందోళనకారులు స్టెరిటైల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో పది మంది వ్యక్తులు చనిపోయారు. ర్యాలీగా వస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులకు తెగబడటంతో పదిమందిప్రాణాలు కోల్పోయారు. అనేకమందికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారంసైతం తూత్తుకూడిలో యువకులు రెచ్చిపోయిపోలీసులపై కాల్పులు జరపడంతో కాలియప్పన్‌ అనే యువకుడు మృతిచెందాడు.మంగళవారం పదిమందితోపాటు 17ఏళ్ల బాలికసైతం పోలీస్‌ కాల్పుల్లో చనిపోయారు. వేదాంతగ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీని మూసివేయాలన్న ఆందోళనతో ర్యాలీగా వస్తున్న ఆందోళనకారులపైపోలీసులు కాల్పులుజరిపిన సంగతి తెలిసిందే. బుధవారం అన్నానగర్‌లోని ఆరోవీధిలో పోలీసులపై అల్లరిమూకలు రాళ్లురువ్వాయని, మరింతగా రాళ్లను విసురుతూ అల్లరిమూకలు పోలీసులపైకి రావడంతో పోలీసులు అదుపుచేసే చర్యల్లో కాల్పులుజరిపినట్లు వెల్లడించారు. ప్రదర్శనకారుల్లో నలుగురికి బుల్లెట్‌గాయాలు తగిలాయని కాలియప్పన్‌ అనే యువకుడికి బుల్లెట్‌గాయాలతో ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చనిపోయినట్లు వెల్లడించారు. అంతకుముందుఆందోళనకారులు రెండు పోలీస్‌ బస్సులను దగ్ధంచేసారు. ఒక వాహనాన్ని విధ్వంసకారులనుంచితప్పించినా మరో వాహనాన్ని ఆందోళనకారులు పూర్తిగా దగ్ధంచేసారు. ద్రవిడ మున్నేట్ర కజగం వర్కింగ్‌ అధ్యక్షుడు ఎంకెస్టాలిన్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యఓఉడు ఎస్‌.తిరునావుక్కరసు, ఎండిఎంకె లీడర్‌ వైకో, విఎస్‌కె వ్యవస్థాపకులు తోల్‌.తిరుమవలన; ఎంఎన్‌ఎం వ్యవస్థాపకులు కమల్‌హాసన్‌లు ప్రభుత్వ ఆసుప్రతిలో తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్నవారిని పరామర్శించారు. అంతకుముందు సిపిఎం నేత కె.బాలకృష్ణన్‌ ఆయన పార్టీ కేడర్‌లు చిదంబరంనగర్‌లో నిరవధిక దీక్షలు నిర్వహించి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్‌చేశారు. వారు దీక్షకు ఉపక్రమించినవెంటనేపోలీసులు వారిని అరెస్టుచేసారు.
ఇదిలా ఉండగా వేదాంత కంపెనీ స్టెరిలైట్‌ విస్తరణ పనులు నిలిపివేయాలని చెన్నై హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. స్టెరిలైట్‌ రెండో యూనిట్‌ నిర్మాణపనులు నిలిపివేయాలని ఆదేశించింది.ఆర్‌.,ఫాతిమా దాఖలుచేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు మధురై బెంచ్‌ జస్టిస్‌ ఎం సుందర్‌, అనితా సుమంత్‌లు వెంటనే నిర్మాణపనులు నిలిపివేయాలని, అలాగే పర్యావరణ క్లియరెన్సులు నాలుగునెలలోపు రావాలని విచారణకు అందచేయాలని ఆదేశించింది. పర్యావరణ క్లియరెన్సులు వచ్చేంతవరకూ వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ నిర్మాణపనులను నిలిపివేయాలని హైకోర్టు బెంచ్‌ ఆదేశించింది.