ఆకాశవాణి,దూరదర్శన్‌లలో రాజకీయ పార్టీలకు ప్రచార సమయం

DOORDARSHAN
DOORDARSHAN

ప్రసంగాలపై నియమనిబంధనలు-మత భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదు
హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో మొత్తం 11 రాజకీయ పార్టీలు ప్రచారం చేసు కోవడానికి అకాశవాణి, దూరదర్శన్‌లలో సమయం కేటాయించారు. వీటిలో 7 జాతీయ పార్టీలు కాగా, మిగిలినవి ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలలో కాంగ్రెస్‌,బిజెపి,ఎన్‌సిపి,అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌,బిఎస్‌పి,సిపిఐ,సిపిఎం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో మజ్లీస్‌,టిఆర్‌ఎస్‌,తెలుగుదేశం,వెస్సాఆర్‌ కాంగ్రెస్‌ ఉన్నాయి. నామినేషన్లు దాఖలు చేసిన రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ఆ పార్టీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రసారాలకు సంబం ధించి సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏయే రోజులు, ఏయే వేళలు కేటాయించాలనేది ప్రసార భారతి నిర్ణయి స్తుంది. జాతీయ,ప్రాంతీయ పార్టీలలో ప్రతి పార్టీకి మౌళికంగా 45 నిమిషాలు కేటాయించాలని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్‌ ఒక ప్రకటనలో తెలియ చేసింది.అదనపు సమయం కేటాయింపు మాత్రం గత ఎన్నికలలో ఆయా పార్టీల సామ ర్థ్యాన్ని బట్టి అనుమతించడం జరుగుతుంది. అయితే ఒక్క విడతలో 15 నిమిషాలకు మించి ప్రచారాన్ని అనుమతించరు. 5 నిమిషాలకు ఒకటి చొప్పున టైమ్‌ ఓచర్లను పార్టీలకు అందజేస్తారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలనే స్వేచ్చ వాటికుం టుంది. అంటే 11 రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం దూరదర్శన్‌లో 990. ఆకాశవాణిలలో 990 నిమిషాలు ఉంటుంది. ఒక్కొక్క దానిలో గరిష్టంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)కి 245 నిమిషాలు కేటాయించారు. అలాగే కాంగ్రెస్‌కు 192 నిమిషాలు, తెలుగుదేశంకు 130 నిమిషాలు కేటాయించారు. మిగిలిన వాటిలో ఆకాశవాణి, దూరదర్శన్‌లలో బిజెపికి 86 నిమిషాలు,బిఎస్‌పికి 53 నిమిషాలు, సిపిఎంకు 54 నిమిషాలు,సిపిఐకి 50 నిమిషాలు అనుమతించగా, మజ్లిస్‌,వైఎస్సార్‌ కాంగ్రెస్‌,ఎఐటిసి,ఎన్‌సిపిలకు 45 నిమిషాలు చొప్పున కేటాయించారు.
రాజకీయ పార్టీలు అవి చేయబోయే ప్రసంగ ప్రతులను,రికార్డులను ముందుగా అందజేయాల్సి ఉంటుంది. ప్రసారభారతి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు స్టూడియోలలో కూడా రికార్డింగ్‌ చేయించుకోవచ్చు. లేదా ముందుగా అను మతి పొంది హైదరాబాద్‌లోని అకాశవాణి, దూరదర్శన్‌ స్టూడియోలలో కూడా రికార్డింగ్‌ చేయించుకోవచ్చు. అకాశవాణి, దూరదర్శన్‌లలో ఎన్నికల ప్రచార ప్రసంగాలకు సంబంధించి పాటించాల్సిన పాటించకూడని నియమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇతర దేశాలను విమర్శించకూడదు.మత భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదు. అశ్లీల లేదా అప్రతిష్టపాలు చేసేవి, హింసను ప్రేరేపించేవి, న్యాయస్థానాల తీర్పులను, వ్యాఖ్యలను అగౌరవపరిచేవి, రాష్ట్రపతి,న్యాయవ్యవస్థలపై ఆభాండాలు వేసివి,దేశ సమగ్రత,సార్వభౌమత్వాలను ప్రశ్నించేవి ఉండకూడదు. అలాగే వ్యక్తుల పేర్లతో విమర్శించకూడదు. ఇవిగాక వీటికి అదనంగా అవకాశవాణి, దూరదర్శన్‌లలోరెండు ప్యానల్‌ చర్చలను ప్రసారభారతి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి రాజకీయ పార్టీ ఒకరిని పంపవచ్చు.ప్రసార భారతితో ఎన్నికల కమిషన్‌ చర్చించి కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటిస్తుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై దూరదర్శన్‌,అకాశవాణిలలో రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునే సంప్రదాయం 1998 నుంచి కొనసాగుతుంది