ఆకతాయి ఈమెయిల్స్‌కు ఆటకట్టు

teenage girl
teenage girl

ఆకతాయి ఈమెయిల్స్‌కు ఆటకట్టు

ఈమధ్య ఓ ప్రబుద్దుడు తన ఇంటి ఓనర్‌ అయిన మహిళ తన ఇంటిని ఖాళీ చేయమన్నందుకు, ఆమెను ఈమెయిల్స్‌ ద్వారా హింసించసాగాడు. ఆమె ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఆమెను వేధించసాగాడు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించడంతో, అతడిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఓ భర్త తనకు అదనపు కట్నం కావాలని కట్టుకున భార్యను అసభ్య ఈమెయిల్స్‌ ద్వారా వేధింపులకు గురిచేయసాగాడు. విసుగు చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, భర్తను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఒక యువకుడు స్నేహితురాలి

ఫోటోలను వాట్సప్‌, పేస్‌బుక్‌లో పెడుతూ, ఆమెను ఒక సెక్స్‌వర్కర్‌గా స్నేహితులతో పంచుకోసాగాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు ఆ యువకుడిని కటకటాల్లోకి పంపారు. హక్కుల సంగతి తరువాత, సమాజం అందరికీ సమానంగా అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను మహిళలు పురుషులతో సమానంగాను, అంతే నిస్సంకోచంగా, నిస్సంశయంగా, నిర్భ´యంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయా అన్నది చాలాసార్లు సందేహాస్పదంగా కనబడుతోంది.

ఎక్కువశాతం మహిళలు కూడా ఉపయోగిస్తున్న ఇంటర్‌నెట్‌లో అసభ్యపద జాలంతో కూడిన మెసేజ్‌లు వారి ఇన్‌బాక్స్‌ల్లో నిండుతున్నాయి. వీటి బారినుంచి మహిళా ఇమెయిల్‌దారులను కాపాడే అవకాశాలు ఏ వినియోగదారుల చట్టానికైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మరో ప్రశ్న. అసభ్యకరమైన ఫోన్‌కాల్స్‌ వచ్చినపుడు టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌కి తెలియజేస్తే సంబంధిత అధికారులు రంగప్రవేశం చేసి, ఆ కాల్స్‌ చేస్తున్న వ్యక్తిని ట్రేస్‌ చేసి అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కానీ మహిళా ఇ మెయిల్‌ దారులకు కలుగుతున్న ఈ అసౌకర్యాన్ని, అశాంతిని ఆపేందుకు – సదరు మహిళల ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఏమైనా చేయగలరా? మహిళల ఇన్‌ బాక్సుల్లో అసభ్యకరమైన చిత్రాలతో కూడిన ప్రకటనలతో పాటు ఇటువంటి పదజాలంతో కూడిన మెసేజ్‌లు కూడా చేరుతున్నాయి. మెయిల్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకునే వరకు అందులో ఉన్నది ఏమిటి అనేది తెలియని పరిస్థితి కనుక ఇటువంటి మెసేజ్‌లను ఎక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌ చేసుకోవలసి రావడం, వారికి బాధాకరమే కాకుండా వారి ఇంటర్నెట్‌ టైమ్‌, డబ్బు కూడా వధా అవుతున్నాయి. ఈ మెసేజ్‌లు చాలా వరకు బొమ్మలతో ఉన్నవి కావడం వల్ల డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అయితే అటువంటి సబ్జెక్ట్‌ లైన్లను బ్లాక్‌చేసి ఆపేందుకు కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే ఇవి పంపే వారు తమ సబ్జెక్ట్‌ లైన్లను అటువంటి అర్ధాన్ని సూచించకుండా మారుస్తున్నారు.

(ఒక పోర్నోగ్రాఫిక్‌ మెయిల్‌ కి ‘అడ్మినిస్ట్రేషన్‌ అనే సబ్జక్ట్‌ లైన్‌, అలాగే ‘మీ ఇంటర్నెట్‌ లైన్‌ని ఏడుగంటల్లో టెర్మినేట్‌ చేస్తున్నాం అని కూడా ఉండొచ్చు). ఆధునిక సాంకేతిక ప్రగతి అందించే సదుపాయాలు జీవితాన్ని సౌకర్యవంతం, విలాసవంతం చేస్తాయనడంలో సందేహంలేదు. అయితే ఇది మనకు అత్యంత అయిష్టకరమైన విషయాలను మన స్వంత ఇంట్లోకి తెస్తూ అందుకు మన నుంచి ఎదురు డబ్బు కూడా వసూలు చేయడం విచిత్రకరమైన పరిస్థితి. ఈ పరిస్థితిని ఖచ్చితంగా తప్పించగలమనే హామీ ఇవ్వలేమని వియస్‌యన్‌యల్‌ సంస్థవారు అంటున్నారు.

1997లో సుప్రీంకోర్టు విశాఖకేసులో ఇచ్చిన తీర్పులో అసభ్యకరమైన మాటలు, సూచనలు కూడా లైంగికపరమైన వేధింపులుగానే పరిగణించాలని తీర్పు చెప్పారు. అలా చూస్తే ఇవి ఖచ్చితంగా ఆ కోవలోనే వస్తాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకునే నేపధ్యంలో అమెరికాలో ఒక బిల్లుని ప్రవేశ పెట్టారు. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి బిల్లుని ప్రవేశపెట్టారు. నార్వే, స్వీడన్‌ డెన్మార్క్‌ల్లో ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌, టెలికామ్‌ ప్రైవసీకి సంబంధించిన ఇటువంటి విషయాల్లో వినియోగదారుల చట్టాలు రూపొందించారు. మనం ఎక్కడ ఏ కొత్త సైబర్‌ టెక్నాలజీ వచ్చినా దానిని దిగుమతి చేసుకుని ఉప యోగించు కోవడం లోనూ, సాఫ్ట్‌వేర్‌ ప్రగతిలో అందరి కంటే ముందున్నామని మురిసి పోవడంలోనూ దిట్టలమే.

అది నిషేధించిన డ్రగ్‌ అయినా కానివ్వండి లేదా సైబర్‌ క్రైమ్‌ అయినా కానివ్వండి, మన వినియోగదారులకు కలిగే అసౌకర్యం, హాని నుంచి కాపాడే పద్ధతుల్ని పాటించడంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. ్య జంక్‌ ఆడ్స్‌ కింది భాగంలో ఉన్న ‘అన్‌ సబ్‌స్క్రైబ్‌ లేదా రిమూవ్‌ బటన్‌ని క్లిక్‌ చేయకండి.ఇది మీ ఇ మెయిల్‌ ఐడిని అవతలి వారికి ధవీకరించుకునే అవకాశాన్ని ఇచ్చి మరిన్ని అసభ్యకరమైన మెసేజ్‌లను ఆహ్వానించడం అవుతుంది.

మెయిల్‌ని ఫిిల్టర్‌ చేసుకునే సూచనలను వియస్‌యన్‌యల్‌ సంస్థ ఇలా చెబుతోంది. అఫెన్సివ్‌ మెసేజ్‌లను ‘అబ్యూజ్‌జీ వియస్‌యన్‌యల్‌.కామ్‌ కి ఫార్‌వర్డ్‌ చేయమంటున్నారు. వియస్‌యన్‌యల్‌కి రాసే కంప్లయింట్‌ లేఖలను ఒక కాపీ వినియోగదారులకు సంబంధించిన సంస్థలకు కూడా పంపించండి.

ఒక్కోసారి కొన్ని సంస్థల్లో నిండిన స్తబ్దతని తొలగించడానికి ఎక్కువ అరుపులు ఆర్భాటం చేయాలి తప్పదు. మహిళా జర్నలిస్టులు కొందరు ఈ విషయంపై పోరాడు తున్నారు. ఇంకా ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ వినబడితే వారి మాటకు బలం హెచ్చి సమస్య పరిష్కారమయ్యే మార్గాలు మెరుగవుతాయి. (డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మీడియా.కామ్‌) అనే వెబ్‌సైట్‌ ఈ అఫెన్సివ్‌ మెయిల్‌ మీద జరుగుతున్న పోరాటం మీద ఒక రిపోర్టుని తయారుచేసింది. మీ సమస్య గురించి పోరాటం మొదలయింది. ఈ విషయాన్ని, వివరాల్ని ఇతర బాధితులతో పంచుకోండి. స్పామ్‌ జనరేటర్స్‌ని ఎదుర్కోవ డానికి అందరూ ఏకమై బలం పెంచుకోవాలని ఒక వెబ్‌సైట్‌ సూచిస్తోంది.