ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా నండూరి

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ)గా నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1984వ బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే డీజీపీగా కొనసాగుతున్న సాంబశివరావును మరోమారు అదే పదవిలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (యూపీఎస్‌సీ)కి సిఫారసు చేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో సాంబశివరావు కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని డీజీపీగా నియమించుకునేలా అధికారాలను తీసుకుంది.