ఆంధ్రకు అన్యాయం, ప్రత్యేకహోదా అనివార్యం

LOKSABHA
LOKSABHA

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు సరిపడా కేటాయింపులు లేవని, కేంద్ర బడ్జెట్‌లో సైతం ఆంధ్రకు అన్యాయంచేసారంటే రాష్ట్రానికి చెందిన ఎంపిలు లోక్‌సభలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మంగళవారం పార్టీ ఎంపిల నిరసనతో లోక్‌సభస్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను కొద్దిసేపు వాయిదా వేసారు. ప్రభుత్వం వారి డిమాండ్లు అత్యంత సున్నితమైనవని వాటిని పరిశీలిస్తామనిప్రభుత్వం హామీఇచ్చినప్పటికీ ఎంపిలు వెనక్కి తగ్గలేదు. లోక్‌సభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకుంది. హౌస్‌వెల్‌లోనికి వచ్చి నినాదాలుచేసారు. స్పీకర్‌ పదేపదే తమతమసీట్లలోనికి వెళ్లాలని సూచించినప్పటికీ ఎంపిలు వెనక్కితగ్గలేదు. భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలమధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నట్లు ఈ నిరసన స్పష్టంచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లోప్రత్యేక కేటాయింపులు ఏమీలేకపోవడంపట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎంపిలు రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు మరిన్ని కేటాయించాలని కోరారు. వారి డిమాండ్లు అత్యంత సున్నితమైన అంశాలని, ప్రధానమంత్రి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌అభివృద్ధిపై అత్యంత శ్రద్ధతో ఉన్నాయని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌మాట్లాడుతూ ఎంపిలు వ్యక్తంచేస్తున్న నిరసనను పరిగణనలోనికి తీసుకుంటామని, వారి డిమాండ్లను సైతం పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానప్రసంగాన్ని కొనసాగించేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తిచేసారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ ఎంపిలు ప్రశ్నోత్తరాలసమయంలో కూడా తమ నిరసనను వ్యక్తంచేయడంతో సభ పదినిమిషాలపాటు11.20వరకూ వాయిదా పడింది. ఇది సరైన పద్దతి కాదని,మీమీసీట్లలోనికి వెళ్లండని స్పీకర్‌ పదేపదే కోరడం కనిపించింది. టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలనుంచి మొత్తం పదిమందికిపైగా ఎంపిలు లోక్‌సభలో ఉన్నారు. వీరిలో ఒకరు తలకు ఎర్రటిరిబ్బన్‌కట్టుకుని, పూలదండవేసుకుని భజనల్లో వినియోగించేచెక్కలను మోగించడం కనిపించింది. పార్లమెంటు తిరిగి సమావేశం కాగానే 11.20 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి అనంత్‌కుమార్‌ నిరసన వ్యక్తంచేస్తున్న ఎంపిలతో మాట్లాడారు. ఎక్కువమంది సభ్యులు వెల్‌లోనికి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండిఅన్న నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని నిరసనప్రకటించారు. కూటమి పొత్తులధర్మాన్ని పాటించాలని, ఆంధ్రకుప్రత్యేక హోదా కల్పించాలని పట్టుబట్టారు. అంతకుముందు ఈ వారంలోనే టిడిపి ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటాయింపులపై కేంద్రాన్ని ఒత్తిడిచేయాలనినిర్ణయించింది. ప్రశ్నోత్తరాలసమయం తర్వాత కూడా నిరసన వ్యక్తంచేస్తున్న సభ్యులను పదేపదే తమసీట్లవద్దకు వెళ్లాలని సూచించారు. వారిప్రవర్తన సహేతుకంగాలేదని వ్యాఖ్యానించినప్పటికీ టిడిపి ఎంపిలు తమనిరసనను కొనసాగించారు