అవిశ్వాస తీర్మానం ఎలా పెట్టాలో తెలియదు

bbbb

అవిశ్వాస తీర్మానం ఎలా పెట్టాలో తెలియదు
హైదరాబాద్‌: అధికార పక్షంపై అవిశ్వాస తీర్మానం ఎలా పెట్టాలోకూడ ప్రతిపక్ష పార్టీకి తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం శాసన సభలో ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆర్పోణలుచేసిన ప్రతిపక్ష నేత వాటికి ఆధారాలు చూపకపోతే సభలో మాట్లాడే అర్హత లేదన్నారు. బేషరుతుగా క్షమాపణచెప్పాలని అన్నారు.

అమరావతి కోసం లండన్‌ వెళ్లా

స్మార్ట్‌సిటీ అమరావతికి మద్దతు ఇవ్వాలని లండన్‌ వెళ్లినట్టు సిఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. జగన్‌ అవినీతిని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయటం ఆయనకు అలవాటైందని అన్నారు. వాళ్లకు అంటిన బురదను తనకు అంటించాలని చూస్తున్నారన్నారు.

పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేశాం

కాంగ్రెస్‌ హాయంలో రాష్ట్రంలో పాలన భ్రష్టుపట్టిందని దాన్ని మేం అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ పాలకులు జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చివేశారని ఆరోపించారు. మేం అధికారాంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పటికీఆర్థిక ఇబ్బందలున్నా పారిశ్రామిక రాయితీగా రూ.2 వేల కోట్లు ఇచ్చామన్నారు.

సోలార్‌ టెండర్లు మాత్రమే పిలించాం,..కేటాయించలేదు

రాష్ట్రంలో సోలార వ్యవస్థకు టెండర్లు మాత్రమే పిలిచామని అనుమతి ఇవ్వలేని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెండర్లే కేటాయించనపుడు ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా రూ.7 వేల కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాజధాని భూసమీకరణలో ఏం చేయకపోయిన అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, ఇవన్నీ నిరాధారాలన్నారు.

జగన్‌ వ్యాఖ్యలు అసెంబ్లీకి తీరని మచ్చ

గౌరవప్రదమైన న్యాయవ్యవస్థపై జగన్‌ చేసిన వాఖ్యలు అసెంబ్ల్లీ చరిత్రలో తీరని మచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. జగన్‌కు ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎన్నడూ చూడలేదన్నారు.