అవిశ్వాసానికి జాతీయ పార్టీల మ‌ద్ద‌తుః మంత్రులు

ayyanna patrudu
ayyanna patrudu

విశాఖ‌ప‌ట్ట‌ణంః కేంద్రంతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబుకు పలు జాతీయ పార్టీలు సంఘీబావం తెలుపుతున్నాయని ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. చేసిన తప్పును దిద్దుకుని ఏపికి ఇప్పటికైనా బీజేపీ న్యాయం చేయాలని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం పెడితే 11 పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. అవిశ్వాసంతో మోదీ గుండెల్లో దడ పుట్టిందని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఒంటెద్దు పోకడలను ఎదుర్కొంటామని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు కేంద్రం తీరుతో విసిగిపోయినవారిలో అవిశ్వాస తీర్మానంతో ధైర్యం వచ్చిందని సోమిరెడ్డి పేర్కొన్నారు.