అవినీతే కాంగ్రెస్‌ చిరునామా

MODI
MODI

అవినీతే కాంగ్రెస్‌ చిరునామా

కులు(హిమాచల్‌ప్రదేశ్‌): హిమాచల్‌ప్రదేశ్‌లో చివరిదశ ఎన్నికల ప్రచారం హోరె త్తుతోంది. విమర్శ ప్రతివిమర్శలతో ప్రధానరాజకీయపార్టీలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్రమోడి ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్‌లో వివిధ ప్రాంతాలలో పరివర్తన్‌ ర్యాలీలలో ప్రసంగిచారు. కాంగ్రెస్‌పై నిశిత విమర్శనాస్త్రాలను సంధించారు. అవినీతే కాంగ్రెస్‌ చిరునామా… కరప్షన్‌కు కారగ్రెస్‌కు అసలు తేడాను లేదు.. రెండూ ఒకటేనని తీవ్ర విమర్శలు చేసారు. అవినీతి కేసులలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ నాయకులు బెయిల్‌పై బయట తిరుగుతూ అవినీతిని అంతంచేస్తామనటం హాస్యాస్పదమని అన్నారు.