అవినీతి రహిత ప్రభుత్వ నిర్వహణే ధ్యేయం

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

అవినీతి రహిత ప్రభుత్వ నిర్వహణే ధ్యేయం

అనకాపల్లి,: అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడమే ధ్యేయమని ప్రధాని మోదీ ఒకవైపు చెబుతుంటే మరోపక్క మోదీ కేబినెట్‌ లోఉన్న ఒక మంత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దొంగబ్బాయి జగన్‌ ఎ1గా మరో ఎ2గా నమోదైన విజయసాయిరెడ్డి ఎన్టీఏలో చేరమని రాయబారాలు పంపడం వెనుక బీజేపీ వైఖరేంటో పూర్తిగా తెలిసిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విశాఖజిల్లా అచ్యు తాపురం మండలం బ్రాండిక్స్‌ కంపెనీని సందర్శించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో లోకేష్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలకు తెలియని విషయాలుకూడా బీజేపీ మంత్రులుచేసిన ప్రకటనలో అర్థం అయిందన్నారు.

బీజేపీ వైసీపీతో ఎటువంటి స్నేహం చేస్తుందో తేటతెల్లం అయిందన్నారు. అలాగే జగన్‌ తన పాదయాత్రలో ప్రధాని మోదీని ప్రత్యే కహోదా కావాలని అడగంలేదని ఎంతసేపు చంద్రబాబుపై విమర్శలు చేయ డంతోనే సరిపోతుందన్నారు. వైసీపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీవెళ్లి మంత్రులకు పాదాభివందనం చేస్తున్నారని వారు బీజేపీతో చేస్తున్న స్నేహమేంటో ప్రజలందరికీ అర్థం అవుతుందన్నారు. ఏపీని విడగొట్టమని ఎప్పుడూ తాము కోరలేదని రాష్ట్ర విభజనకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేసిన తప్పిదాలవల్లే రాష్ట్ర విభజన జరిగిందని అయితే విభజన జరిగిన తాను భాదపడలేదని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 16500కోట్ల లోటు బడ్జెట్‌ ఇస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రకటన చేశారన్నారు. 18 నెలలుగా తాము ప్రత్యేకహోదా వస్తుందని ఆశించామని హోదా ఇవ్వలేమని ఆర్దిక సంఘం పేరుతో ప్యాకేజీ ఇస్వామని చెప్పారని ప్యాకేజీకూడా 8 వేల కోట్ల రూపాయలు మొదటి ఇస్తామని అందులో 1500 కోట్లు ఇస్తామని అంగీకరించారని చివరికి 350 కోట్లు ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి తీసుకున్నారన్నారు.

అయిన్పటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొక్కవోని దీక్షతో కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌డీవో ఉండి ప్రధాని చుట్టూ తిరిగిన లాభంలేకు చివరకు బయటకు రావడం జరిగిందన్నారు. ఎన్టీఏలో ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రమంత్రిగాఉన్న నిర్మలా సీతారాంకు, సురేష్‌ప్రభుకు రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నిక చేయడం జరిగిందన్నారు. గుందేల్‌ఖండ్‌ తర హాలో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని ఆశించామని అవి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో చత్తీష్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను విడ గొట్టిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, అమరావతిలలో ఏర్పాటు చేయడానికి ఇతర దేశాలకు తిరిగి కియో మోటార్సు, హీరో హోండా కంపెనీ, ఫ్రాంకలింగ్‌ కంపెనీలు రావడానికి కృషి చేశారన్నారు. విశాఖపట్నం ఐటీ టవర్‌ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు.

హైదరాబాద్‌ను సైబరాబాద్‌ను తీర్చిదిద్దింది చంద్రబాబే అన్నారు. కర్నాటకలో బెంగళూరు, తమిళనాడులో మద్రాసు ఐటీ రంగంలో అభివృద్ధి చెందడానికి సుమారు 15 ఏళ్లు పట్టిందన్నారు. సీఎం చంద్రబాబు గూగుల్‌ కార్యాలయంకూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. భారతదేశంలోనే చిప్‌లు తయారుచేసే ఇండస్ట్రీని తిరుపతిలో 75 ఎకరాల్లో స్థలంలో కేటాయించామన్నారు.