అవలీలగా సిరీస్‌ గెలిచిన భారత్‌

TEAMINDIA
TEAMINDIA

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో 9 వికెట్లతో ఘన విజయం సాధించింది టీమిండియా. విండీస్‌ను కేవలం 104 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి సేన తర్వాత లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లనే ఛేదించింది. ధావన్‌ మాత్రమే ఔటయ్యాడు. రోహిత్‌(63), కోహ్లి(33) నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిచింది. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేను గెలవగా, రెండో వన్డే టైగా ముగిసింది. మూడో వన్డేలో విండీస్‌ గెలవడంతో సిరీస్‌ 1-1తో సమానమైంది. చివరిరెండు వన్డేలను గెలిచిన కోహ్లి సేన సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.