అలస్కాలో రెండు వరుస భూకంపాలు

earthquakes hit alaska
earthquakes hit alaska

వాషింగ్టన్‌: రెండు వరుస భూకంపాలు అగ్రరాజ్యాన్ని వణికించాయి. అమెరికాలోని అలస్కాలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7గా నమోదైంది. అలస్కాలోని యాంకరేజ్‌ నగరానికి 11 మైళ్ల దూరంలో భూమికి 21 మైళ్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడికి కొద్ది నిమిషాల వ్యవధిలోనే రిక్టర్‌స్కేల్‌పై 5.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.  ఈ రెండు భూకంపాల ధాటికి ప్రాణ నష్టం జరగకపోయినా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అలస్కాలోని చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు కుంగిపోయాయి. జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాసేపటికే ఉపసంహరించుకున్నారు. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.