అమెరికా సైనిక విన్యాసాలపై ర‌ష్యా అభ్యంత‌రం

russia
russia

మాస్కోః క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఇటీవ‌ల‌ దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక విన్యాసాలు జరపడం ప‌ట్ల రష్యా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అమెరికా త‌న చ‌ర్య‌ల ద్వారా అనవసర ఉద్రిక్తతలకు కారణమవుతోందని ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జయ్‌ లావ్రో తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌తో ఈ విష‌యంపై చ‌ర్చించారు. మ‌రోవైపు దౌత్య మార్గంలో ఉత్త‌ర‌కొరియా స‌మ‌స్య‌ పరిష్కారానికి ప్రయత్నించాలని రష్యా సూచించిన అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలతో ప్రయోజనం లేదని ట్విట్టర్ లో పేర్కొన్నారు.