అమెరికా మార్కెట్లోకి రెడ్డిస్‌ కొలెస్ట్రాల్‌ ఔషదం టాబ్టెట్లు

Dr.Reddy's Lab
Dr.Reddy’s Lab

హైదరాబాద్‌కు చెందిన దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అమెరికా మార్కెట్లోకి కొలిసెవిలామ్‌ హైడ్రోక్లోరైడ్‌ టాబ్లెట్లను విడుదల చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఆమోదంతో జనరిక్‌ వెర్షన్‌లో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టు కంపెనీ తెలిపింది. ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం చేస్తూ ఈ టాబ్లెట్లు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయని పేర్కొంది. జపాన్‌కు చెందిన దైచీ సాంక్యో ఇప్పటికే ఈ ఔషధాన్ని వెల్‌కాల్‌ బ్రాండ్‌ పేరుతో అమెరికాలో మార్కెట్‌ చేస్తోంది. 2018, ఆగస్టుతో ముగిసిన 12 నెలల కాలంలో ఈ ఔషద విక్రయాలు 47.1 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.3,503 కోట్లు) ఉన్నాయి. తాజాగా డాక్టర్‌ రెడ్డీస్‌ జనరిక్‌ వెర్షన్‌లో ఈ టాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. ఈ వార్తలతో బిఎస్‌ఇలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 4.6 శాతం లాభంతో రూ.2,446.60 దగ్గర క్లోజైంది.