అమలులోకి వస్తున్న కొత్తనోట్లు

RS 200
RS 200

అమలులోకి వస్తున్న కొత్తనోట్లు

ముంబయి,ఆగస్టు 24: అక్రమనగదు చెలామణి, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్టవేసేందుకు రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.200 నోట్లను ముద్రిస్తున్న అంశం ఇటీవలే వెలుగులోనికి వచ్చింది. ఈ కొత్త నోటు ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబరు తొలివారంలో చెలామణిలోకి వస్తుందని సమాచారం. ఈ వ్యవహా రంతో సంబంధం ఉన్న కొందరు అధికార వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి. అయితే రూ.200 నోట్ల అందుబాటులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 50 కోట్ల నోట్లను ముద్రించినట్లు ఆర్థికశాఖ సమాచారం. రూ.100, రూ.500నోట్ల మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటివరకూ లేదు. దీని తో రూ.200నోటు మంచి ఆదరణ పొందు తుందని ఆర్‌బిఐఅంచనా. అంతేకాక రూ.200 నోట్లు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బిఐ అన్నిచర్యలు తీసుకుంటున్నదని బ్యాం కింగ్‌ నిపుణులు చెపుతున్నారు. ప్రధానమంత్రి గత ఏడాది పెద్దనోట్ల రద్దు ప్రకటించిన తర్వా త చెలామణిలో కరెన్సీ నోట్లకు విపరీతమైన కొరత వచ్చినసంగతి తెలిసిందే. అలాగే మరో సారి వెయ్యిరూపాయల నోట్లనుప్రవేశపెట్టే యోచనలేదని కూడా ఆర్‌బిఐ ప్రకటించింది. గత ఏడాది రూ.500, రూ.1000నోట్లు రద్దుచేసిన తర్వాత రూ.100 రూ.500మధ్యలో రూ.200 కరెన్సీనోటు ను తీసుకురావాలన్న డిమాండ్‌ భారీగా వినిపించింది. కేవలం ఎక్కువ విలువలున్న రూ.2000 నోట్లతో ఎక్కడచూసినా చిల్లర నోట్ల కొరత ఎదుర్కొంటున్నందున రూ.200నోట్లను చెలామణిలోకి తీసుకు రావాలని చూస్తోంది. అలాగే మహాత్మాగాంధీ సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను కూడా ఈనెలలోనే తీసుకువస్తామని ఆర్‌బిఐ ప్రకటించింది. కొత్త ఫ్లోరోసెంట్‌ బ్లూరంగులో ఉన్న ఈనోట్లలో హంపి రధం వెనుకవైపు ఉంటుంది. 66మిల్టీమీటర్లు, 135 మిల్లిమీటర్ల పొడవుతో ఉంటుంది. మొదటిగా ముందు వైపు 50అంకె ముద్రించి ఉంటుంది. హ్యాలోగుర్తు కూడా వెనుక,ముందు కూడా ముద్రిస్తారు. వాటర్‌ మార్క్‌ ఇతర అన్ని ఫీచర్లు ఒక్కటే. దేవనాగరి లిపిలో మహాత్మాగాంధీ చిత్రంమధ్యలో ముగ్రించి ఉం టుంది. నోట్ల ముందుకుడివైపు అశోక్‌ స్తంభం ముద్రిస్తారు. ఆర్‌బిఐ గవర్నర్‌ సంతకం ఆర్‌బిఐ చిహ్నం ఈనోట్‌లో ఉంటాయి. నోట్లు ముద్రించిన సంవత్సరం వివరాలు వెనుకవైపు ఎడమపక్కన కనిపిస్తుంది.