అప్పుడే రాను : మాల్యా

MALYA
Vijay Malya (file photo)

 

అప్పుడే రాను : మాల్యా
ఢిల్లీ: విజయమాల్యా వ్యాఖ్యలు ఆదివారం బ్రిటన్‌ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.భారత్‌ నుంచి తాను తప్పించుకురాలేదని, తొందరపడి భారత్‌కు వెళ్లబోనని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌కుచెందిన సండే గార్డియన్‌ ఇ మెయిల్‌ ఇంటర్వ్యూలో మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. తను ఎలాంటి తప్పుచేయలేదని పేర్కొన్నారు. మార్చి2 హఠాత్తుగా బ్రిటన్‌ రావటానికి కారణం ఏంటి? రుణాలు చెలించలేకే ఇక్కడకు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ తన మిత్రుడితో కలిసిన వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడకు వచ్చానన్నారు. తాను 7 బ్యాగులతో ఇక్కడకు వచ్చానని రాశారని, ఇద్దరు వ్యక్తుల కోసం 7 బ్యాగులు పెద్దలగేజీ కాదని ఎపుడూ ఎక్కువ లగేజీతో తాను పయనిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.