అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు

hamid ansari
hamid ansari

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవి నేటితో ముగించుకోనున్న హమీద్‌ అన్సారీ రాజ్యసభ టీవీకి ఇచ్చిన తన చివరి ఇంటర్వ్యూలో వివాదాస్పద
వాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాప్తిస్తున్నాయని, దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది
ఇబ్బందికరమైన విషయమని అన్నారు. జాతీయవాదాన్ని ప్రతిరోజు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని, తాను భారతీయుడినేనని
అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల భాజపా నేతలు భగ్గుమంటున్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఇటువంటి వ్యాఖ్యలు
చేయడం ఏంటని అన్సారీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.