అనుష్క నటన బాగా నచ్చింది, కోహ్లి రివ్యూ

virushka
virushka

ముంబై: టీమిండియా సారథి విరాట్‌ తన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మపై మరోసారి ప్రశంసలు కురిపించాడు. అనుష్క నటించిన చిత్రాలు విడుదలైన వెంటనే వాటిని చూసి కోహ్లి రివ్యూలిస్తుంటాడు. అనుష్క నటించిన జీరో చిత్రం చూసిని విరాట్‌ ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. జీరో చిత్రాన్ని తాను బాగా ఎంజాయి చేసినట్లు ,ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారని ,ముఖ్యంగా అనుష్క నటన బాగా నచ్చిందని ప్రశంసలు ట్వీట్‌ ద్వారా కురిపించాడు. ఆనంద్‌ ఎల్‌. రాయి దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంటుంది.