అనర్హత వేటుపై మూడో జడ్జి విచారణ

                          అనర్హత వేటుపై మూడో జడ్జి విచారణ

Madras High Court
Madras High Court

చీఫ్‌జస్టిస్‌ నిర్ణయంతో విభేదించిన హైకోర్టు జడ్జి
మూడోజడ్జి విచారణకోసం ఎమ్మెల్యేల అనర్హతకేసు
చెన్నై: తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ విచారించిన మద్రాసు హైకోర్టు అనూహ్యరీతిన తీర్పు వెలువడుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనర్హత వేటును సమర్ధిస్తుండగా బెంచ్‌పై ఉన్న మరో న్యాయమూర్తి అనర్హత వేటును వ్యతిరేకిస్తున్నారు. దీనితో మూడో జడ్జి ఈ కేసు విచారణజరిపి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అప్పటివరకూ సమగ్ర తీర్పు వెలువడే అవకాశం లేదు. మూడోజడ్జి తీర్పు చెప్పేంతవరకూ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడానికి వీలులేదు. ఎఐఎడిఎంకెకు చెందిన 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్‌ పి.ధన్‌పాల్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. వీరంతా ఎఎంఎంకె నేత టిటివి దినకరన్‌ విధేయులుగా అప్పట్లో వీరు అసమ్మతి ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న అభియోగాలపై వీరిని అనర్హులుగా ప్రకటించారు. ఈఅనర్హత వేటుపై హైకోర్టులో బహిష్కృత ఎమ్మెల్యేలు సవాల్‌చేసారు. విచారణ జరిగినతర్వాత ఛీఫ్‌జస్టిస్‌ ఇందిరా బెనర్జీ స్పీకర్‌ ధన్‌పాల్‌నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే బెంచ్‌పై ఉన్న మరో జడ్జి జస్టిస్‌ సుందర్‌ ఏకీభవించకపోవడంతో తీర్పు విభిన్నంగా వెలుడనున్నది. ఈకేసు విచారణను మూడవ న్యాయమూర్తి చేపట్టాల్సి ఉంది. బెంచ్‌పై ఉన్న సహచర జడ్జి అభిప్రాయంతో విభేదించిన ఛీఫ్‌జస్టిస్‌ నిర్ణయం వెలువడటంతో ఇక మూడోజడ్జి విచారణ విధిగా నిర్వహించాలిస ఉంది. అప్పటివరకూ ఎలాంటి బలపరీక్షలు జరిగే అవకాశం లేదు. 2017 సెప్టెంబరు 18వ తేదీ స్పీకర్‌ ధన్‌పాల్‌ 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసారు.

రాజ్యాంగంలోని పదవ అధికరణం ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చట్టాని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పరిగణిస్తారు. తమిళనాడు అసెంబ్లీ అనర్హత పార్టీ ఫిరాయింపు నిబంధనలు 1986 ప్రకారం వీరిపైచర్య తీసుకున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.ఈ అనర్హతవేటు ఒక్కసారిగా తమిళనాట రాజకీయాలను మరింతగా వేడెక్కించింది. 18 మంది పిటిషనర్లు అప్పటి గవర్నర్‌ ఇన్‌ఛార్జి సి.విద్యాసాగర్‌రావును ఆగస్టు 22వ తేదీ కలిసి తమ మద్దతును ముఖ్యమంత్రికి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈసంఘటనను మీడియా సమావేశం పెట్టి మరీ ధృవీకరించారు. వీటితో ప్రభుత్వ విప్‌ ఎస్‌?రాజేంద్రన్‌ స్పీకర్‌కు పిటిషన్‌ ఇస్తూ గత ఏడాది ఆగస్టు 24వ తేదీ ఈ 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగాప్రకటించాలని కోరారు. వారి కార్యాచరణమొత్తం ఎఐఎడిఎంకెప్రాథమిక సభ్యత్వంనుంచి సైతం వైదొలిగేవిధంగా ఉన్నాయని వివరించారు. ఈ పిటిషన్‌పై ఎమ్మెల్యేలు మొత్తం తమ వాదనను వినిపించారు. గవర్నర్‌కు విజ్ఞప్తిచేసినంతమాత్రాన పార్టీ సభ్యత్వం వదులుకున్నట్లు కాదని, ఉప్రీంకోర్టు 2011లో ఇచ్చిన బలాచంద్ర ఎల్‌ జర్కిహోలి వర్సెస్‌ బిఎస్‌ యెడ్యూరప్ప తీర్పును పరిగణనలోనికి తీసుకోవాలని అభ్యర్ధించారు. అయితేవిచారణపూర్తిచేసిన తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలనుసైతం పరిగణనలోనికి తీసుకున్న స్పీకర్‌ 19 మందిలో 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో ఎమ్మెల్యే జక్కియన్‌ మాత్రమే స్పీకర్‌ను కలిసి లేఖను ఇచ్చారు.

గవర్నర్‌కు విజ్ఞప్తిచేయాలని ఒత్తిడిచేసితనను లేఖ ఇప్పించారని వివరించారు. అయితే 18 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌చేసారు. అసెంబ్లీలో అధికార ఎఐఎడిఎంకెకు 116 మంది సభ్యులున్నారు. డిఎంకెకు89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ఎకు ఎనిమిది మంది, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. స్పీకర్‌తోపాటు ఎఐఎడిఎంకకు 116మంది ఉన్నారు. అంతేకాకుండామరో 18కిపైగా ఖాళీలున్నాయి. మరొకరు నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇ.రత్నసభాపతి, విటి కలైసెల్వన్‌, ఎ.ప్రభు వంటివారు దినకరన్‌కు తమ మద్దతును ప్రకటించారు. మరోముగ్గురు ఎస్‌.కరుణాస్‌, తమిమమ్‌ అన్సారి,యు తనియిరసు వంటి వారు ఎఐఎడిఎంకె టికెట్‌పై గెలుపొందారు. ఎపి, మజెక,తమిళనాడు కొంగు ఇలైంగార్‌ పెరావైలకు చెందినవారైనా వారు ఎఐఎడిఎంకె టికెట్‌పై గెలుపొందారు. వీరు ముగ్గురు కూడా తమ రాజకీయ విధేయతను స్పష్టంగా వెల్లడించలేదు. దీనితో ముందు అనర్హతవేటుపడిన ఎమ్మెల్యేలుమద్రాస్‌ హైకోర్టులో సవాల్‌చేయడంతో కోర్టుసైతం భిన్నస్వరాలు వినిపించింది. చీఫ్‌జస్టిస్‌ బెనర్జీ స్పీకర్‌ నిర్ణయంతో ఏకీభవిస్తుండగా మరోజడ్జి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా మూడోజడ్జి విచారణ,తీర్పుకోసం ఎమ్మెల్యేల అనర్హతవేటు కేసు ఎదురుచూస్తోంది. అప్పటివరకూ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరిగే అవకాశం లేకపోవడంతో పళనిస్వామి ప్రభుత్వానికి ఇప్పట్లో చిక్కులు లేనట్లేనని చెప్పవచ్చు.