అనర్హత కేసు విచారణకు కొత్త జడ్జికి బాధ్యతలు

Madras High Court
Madras High Court

న్యూఢిల్లీ: అన్నాడీఎంకె ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసును మద్రాస్‌ హైకోర్టు నుంచి బదిలీ చేసేందుకు సుప్రీం తిరస్కరించింది. ఈ కేసు విచారణ బాధ్యతలను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం సత్యనారాయణకు అప్పగించింది. గతవారం ఈ కేసులో మద్రాసు హైకోర్టు మిశ్రమ తీర్పు చెప్పడంతో..మూడో న్యాయమూర్తి విచారణ అనివార్యమైంది. కాగా దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ 18 మంది అన్నాడిఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సమర్ధించగా స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేస్తూ జస్టిస్‌ సుందర్‌ తీర్పు చెప్పారు.