అజాంఖాన్‌పై దేశ‌ద్రోహం కేసు కొట్టివేత‌

AJAM KHAN
AJAM KHAN

బ‌దౌన్ః సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌పై నమోదైన దేశద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది. కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజంఖాన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు సమర్పించిన తుది నివేదికను తిరస్కరించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమర్‌జీత్ సింగ్ అజంఖాన్‌పై నమోదైన దేశద్రోహం కేసును కొట్టివేశారు. 2010 డిసెంబర్ 21న కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజంఖాన్‌పై బజరంగ్‌దళ్ కార్యకర్త ఉజ్జావల్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.