అగ్రవర్ణ పేదల కోటా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

LOKSABHA
LOKSABHA

ముందుగా ఎందుకు నోటీస్‌ ఇవ్వలేదని ప్రతిపక్షాల ఆగ్రహం
లోక్‌సభ ఎన్నికల రాజకీయమే రిజర్వేషన్‌కోటా బిల్లు- కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదించిన బిల్లుపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘచర్చజరిగిన తర్వాత బిల్లు ఆమోదం లభించింది.అధికారమిత్రపక్షాలకు చెందినమెజార్టీ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.మొత్తం 319 మంది సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కేవలం నలుగురు మాత్రమే బిల్లును వ్యతిరేకించారు. మొత్తం 323 మందిసభ్యుల్లో మెజార్టీసభ్యులు ఆమోదించడంతో ఈ బిల్లు ఇక బుధవారం రాజ్యసభలో చర్చకు రానున్నది. అంతకుముందు ఈ బిల్లు అమలుకోసం ముందు 124 రాజ్యాంగసవరణ బిల్లునులోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టారు. అంతకుముందు లోక్‌సభ శీతాకాలసమావేశాల్లో డిఎన్‌ఎ టెక్నాలజీ బిల్లు, పౌరసత్వ బిల్లులను ఆమోదించింది. చివరిగా ప్రవేశపెట్టిన పదిశాతం అగ్రవర్ణాల రిజర్వేషన్‌ బిల్లుపై విపక్షాలు బిల్లును ప్రతిపాదించిన సమయంపైనే ఎక్కువ విమర్శించాయి. ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ కులపరమైన రిజర్వేషన్లకే 50శాతం సుప్రీంకోర్టు పరిమితి ఉందని, ఈ బిల్లుకు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం లేదని లోక్‌సభలో వివరణ ఇచ్చారు.రిజర్వేషన్లపరిమితిని 50శాతం దాటలేదని, ఎస్‌సి పరిమితి ఉందని అన్నారు. కులపరమైన రిజర్వేషన్లు కాదని, అగ్రవర్ణాల్లో నిరుపేదలకు కల్పించే రిజర్వేషన్‌ అని అన్నారు. ఈ పరిమితి కేవలం ఎస్‌సిఎస్టీలకు సామాజికగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మాత్రమేనని అన్నారు. సబ్‌కాసాథ్‌ సబ్‌కా వికాస్‌ నినాదాన్ని ఈ బిల్లు నిజంచేస్తోందని, సమానత్వం ప్రాతిపదికన సామాజిక అభ్యన్నతికే ఈ బిల్లును ప్రవేశపెట్టామని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ వాదించారు. అన్నిపార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన పదేపదే కోరారు. 1991లో ఆనాటి ప్రధాని సైతం ఈ బిల్లును ప్రవేశపెట్టారని అయితే కోర్టుపరిధిలో వీగిపోయిందన్న అంశాన్ని గుర్తుచేసారు. ప్రస్తుతం బిల్లుకు రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని, అదిరాజ్యాంగ పీఠికలోనే ఉందని జైట్లీ వివరించారు. పదిశాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినతర్వాత లోక్‌సభలో చివరిరోజు కాంగ్రెస్‌,ఎస్‌పి ఇతర పార్టీలు వివిధ అంశాలపై చర్చించాలన ఇపట్టుబడుతూ నిరసన తెలిపాయి. ట్రేడ్‌యూనియన్లు చేపట్టిన రెండురోజులసమ్మెను కూడా చర్చించాలని పట్టుబట్టాయి. పదిశాతం రిజర్వేషన్‌ బిల్లుపై జరిగిన చర్చలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకూడా వచ్చారు. ఈ బిల్లుప్రవేశపెట్టేముందు ఎందుకు నోటీస్‌ ఇవ్వలేదని ఎంపి శశిథరూర్‌ పేర్కొన్నారు. ఏబిల్లును ఏసమయంలో అయినా లోక్‌సభకు ప్రవేశపెట్టవచ్చా అని ప్రశ్నించారు.మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ కోటా బిల్లు మోసమని, రాజ్యాంగంలో ఎక్కడా లేదని వాదించారు. ఈబిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. అంబేడ్కర్‌ను అవమానించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌పికి చెందిన ఎన్‌కె ప్రేమచంద్రన్‌ మాట్లాడుతూ ఇదొక చరిత్రాత్మక బిల్లు అని ప్రభుత్వ ఈసమయంలో తీసుకురావడంమంచిది కాదని, ఇది కేవలం ఎన్నికల రాజకీయంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగం వృద్ధిపై కృషిచేస్తోందని, చట్టరూపంలో వచ్చినపుడే వాస్తవ ఉపాధికల్పన తెలుస్తుందని అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రభావితంచేసేందుకే ఈ బిల్లుప్రవేశపెట్టారని ఇటి మహ్మద్‌ బషీర్‌ అనే సభ్యుడూరోపించారు. బిజెపికి చెందిన నంద్‌కుమార్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఒక నిర్దిష్టమైన కులంలో పుట్టడమే వారుచేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. అన్ని మతాలు,కులాల్లోని నిరుద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలన ఇఅందుకే బిజెపి ఈ బిల్లును తెచ్చిందని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాలచివరిరోజునే ఎందుకు ఈ బిల్లును తెచ్చారని, అంతకుముందు ఎందుకు గుర్తుకురాలేదని కాంగ్రెస్‌ సభ్యుడు దీపేందర్‌సింగ్‌ హూడా ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యతనివ్వాలని, అలాగే మిగిలినవారికిప్రైవేటుస్కూళ్లలో చదివినవారికి ఇవ్వాలని ఉపేంద్రకుష్వాహాసూచించారు. పదిశాతం రిజర్వేషన్‌ వెనుక లాజిక్‌ వివరించాలని, 15శాతం, 8శాతం, ఐదుశాతం, లేదా ఐదుశాతం ఎందుకు విధించలేదని అన్నారు. ఆప్‌పార్టీ భగవత్‌మాన్‌ మాట్లాడుతూ ఇదొక రాజకీయ స్టంట్‌ అని పేర్కొన్నారు. ఇదొక ఎన్నికల తాయిలం అని ఆయన అన్నారు. బిజెపికి చెందిన నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ తాను ఆర్ధికంగా వెనుకబడిన రంగంనుంచే వచ్చానని, ఈబిల్లు ఆమోదంపొంది తమకు రిజర్వేషన్లు వస్తే ఇదే తమకు నిజమైన దీవాలి, హోలి అని పేర్కొన్నారు. ఆర్‌జెడికి చెందిన జైప్రకాష్‌ నారాయణ్‌ యాదవ్‌మాట్లాడుతూ రాజకీయ ద్రోహమని పేర్కొన్నారు. ఎస్‌సిఎస్టీ రిజర్వేషన్లను 85శాతానికి పెంచాలని, పదివాతం ఆర్ధికంగా వెనుక్బడినతరగతులకు అప్ప్పుడు ఇవ్వాలని డిమాండ్‌చేసారు. ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలే మాటాలడుతూ ఎలాంటి రాజకీయ నిర్ణయం లేదని, ఎలాంట ఇసర్వేలు కూడా లూఏకుండానే ఈబిల్లును తెచ్చారని పేర్కొన్నారు. ఈ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని సిపిఎం ఎంపి జితేంద్రచౌదరి డిమాండ్‌చేసారు. కులాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఆర్ధిక హోదాయే కీలకమని బిజెడికి చెందిన భర్తుృహరి మెహతాబ్‌ పేర్కొన్నారు. సమాచారాన్ని కనీసం పదేళ్లపాటు సేకరించాల్సి ఉండాల్సిందని, ఈ బిల్లులో అదేమీ లేదని వెల్లడించారు. ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు బిల్లును అమలుకు తేవాలని లోక్‌జనశక్తిపార్టీ అధినేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌పేర్కొన్నారు. ఈ బిల్లు యువతను తప్పుదారిపట్టిస్తుందని, అపోహలు కల్పిస్తున్నదని బెంగాల్‌కు చెందిన సుదీప్‌ బంధోపాధ్యా§్‌ు పేర్కొన్నారు. ఈ బిల్లు నిర్దిష్టమైన హామీలు కల్పించలేకపోతోందని వాదించారు. ఎఐఎడిఎంకెకు చెందిన తంబిదురైమాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ప్రవేశపెట్టిన పథకాలు విఫలం అయ్యాయా ఎందుకు ఈరిజర్వేషన్లు తెచ్చారని పేర్కొన్నారు.