‘అగ్ని-4’ సక్సెస్‌

AGNI-4--
AGNI-4–

‘అగ్ని-4’ సక్సెస్‌

బాలాసోర్‌(ఒడిశా): అణ్వాయుధవ్యూహాత్మక ఖండాం తర క్షిపణి అగ్ని-4ను ఒడిశా తీరంలో విజయవంతంగా ప్రయోగాత్మక పరీక్షలు పూర్తిచేసారు. బాలాసోర్‌లోని క్షిపణిప్రయోగ వాహికలోని నాలుగో నెంబరు లాంచ్‌పాడ్‌నుంచి ఉదయం 8.30 గంటలకుప్రయోగించారు. ఒడిశాలోని ఎపిజె అబ్దుల్‌కలామ్‌ సమీకృత పరీక్షా కేంద్రంనుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువున్న ఈ క్షిపణి దేశీయ ఏవియానిక్స్‌ను సంతరించుకుని రూపొందింది. ఐదోతరం ఆన్‌బోర్డు కంప్యూటర్‌ అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఖండాంతర క్షిపణి తనంతతానుగానే మార్పులుచేసుకుని మార్గదర్శనంచేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఖండాంతర క్షిపణి అగ్ని-5ను ప్రయోగించిన అనంతరం కొద్దినెలలకే మళ్లీ మన రక్షణరంగ పరివోధన సంస్థలు అబ్దుల్‌కలామ్‌ ద్వీపంనుంచి విజయవంతంగా అగ్ని-4ను ప్రయోగించారు. ఈ క్షిపణి అణ్యాఉధ, సాంద్రాయ ఆయుధాలనుసైతం మోసుకెళ్లే సామర్ధ్యంతో ఉంటుంది.