అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఏబిడి రిటైర్మెంట్‌

A B DEVILLIERS
A B DEVILLIERS

కేప్‌టౌన్‌: సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్‌, మిస్టర్‌ 360 ఏబి డివిలియర్స్‌ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ ఏడాది ఐపిఎల్‌ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా వెళ్లిన ఏబిడి తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో క్రీడా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఐతే ఏబిడి రిటైర్‌మెంట్‌తో బాధలో ఉన్న అతని అభిమానులకు ఓ ప్రకటన చేశాడు. మరికొన్ని సంవత్సరాలు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తాను ఆడాలని భావిస్తున్నట్లు ఏబిడి ఇటీవల తెలిపాడు. తాను ఇంకొన్ని సంవత్సరాలు ఐపిఎల్‌లో ఆడతానని తెలిపాడు.