అంతర్జాతీయ క్రికెట్‌కు సిక్సర్ల వీరుడు గుడ్‌ బై

yuvaraj singh
yuvaraj singh

ముంబై: టీమిండియాలో సిక్సర్ల వీరుడు, క్రికెటర్‌ ఐన యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా సోమవారం నాడు ఆయన ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఆర్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువరాజ్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలోనూ యువీ తన పాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ..2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/