అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని అక‌స్మిక త‌నిఖీ చేసిన మంత్రి సునీత‌

ap minister sunitha
ap minister sunitha

అనంతపురంః అనంతపురం టౌన్, ఉమానగర్ లోని అంగన్ వాడీ ప్రీ స్కూల్ ను మంత్రి పరిటాల సునీత,
నగర్ మేయర్ స్వరూపతో క‌లిసి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సంద‌ర్భంగా ప్రీ స్కూల్ లో సౌకర్యాలను అడిగి
తెలుసుకున్నారు. పిల్లలకు, బాలింతలు మరియు గర్భిణీ స్త్రీ లకు ఇచ్చే గుడ్లు, పాలు పరిశీలించిన మంత్రి ప్రభుత్వం
గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అన్న అమృత హస్తం పధకాన్ని అమలు చేస్తుంద‌ని, పిల్లలు,
గర్బిణీలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం అమలులో ఏమైనా
అవకతవకలు జరిగితే ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.