గాయని లతా మంగేష్కర్‌కు తీవ్ర అస్వస్థత

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

Lata Mangeshkar
Lata Mangeshkar

ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ పడిలో అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు. ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/