నేటి తో ముగియనున్న ఎన్నికల ప్రచారం

election campaign
election campaign

హైదరాబాద్‌: ఈరోజుతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనున్నది. సాయంత్రం ఐదు గంట వరకే సమయం ఉన్నది దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. బహిరంగసభలతోపాటు ర్యాలీలు, ఇంటింటికీ ప్రచారంలో అన్ని పార్టీలు తలమునకలయ్యాయి. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ ఆయా నియోజకవర్గాలలో ఉండకూడని స్పష్టంచేసింది. ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం నగదు, మద్యం పంపిణీని అడ్డుకోవడానికి తనిఖీలను ముమ్మరం చేయనున్నది. ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లు ప్రశాతంగా ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని ఈసీ భావిస్తున్నది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/