ఛత్తీస్‌గఢ్ లోమందుపాతర పేల్చిన మావోలు

landmine-blast
landmine-blast

ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్ జిల్లా కరేం సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 168వ బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవాను పరిస్థితి విషమంగా ఉండడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/