ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చైతన్యవంతులు

పేద ప్రజల కోసమే ల్యాండ్‌ పూలింగ్‌

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్యయాత్రపై మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించారని బొత్స సత్యనారయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల కోసమే ల్యాండ్‌ పూలింగ్‌ చేపడుతున్నామని..బలవంతపు భూసేకరణ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/