ఒకే వేదికపై లాలూ కుమారులు

tejaswi yadav, tej pratap yadav
tejaswi yadav, tej pratap yadav

పాట్నా: ఇటీవల లాలూ కుమారుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చి వారు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వారు ఒకే వేదికను పంచుకుని ఎన్నికల వేళ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. సోదరి మీసా భారతి కోసం లాలూ కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లు కలిసి కట్టుగా ప్రచారం చేశారు. సోమవారం బీహార్‌లో జరిగిన ప్రచారంలో ఓ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. ఆర్జేడిని వీడి ఇటీవల తేజ ప్రతాప్‌ వెళ్లిపోయారు. కొన్ని చోట్ల అతను ఆర్జేడికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కానీ సోదరి మీసా భారతి కోసం మాత్రం తల్లి రబ్రీదేవితో కలిసి తేజ్‌ ప్రతాప్‌ ప్రచారం చేస్తున్నాడు. పాటలీపుత్రనుంచి మీసా భారతి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బిజెపి తరఫున కేంద్ర మంత్రి రామ్‌ క్రిపాల్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఇటీవల భార్యకు విడాకులు ఇచ్చేందుకు తేజ్‌ ప్రతాప్‌ సిద్దం కావడంతో లాలూ ఇంటి సమస్య తీవ్రమైంది. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/