లక్ష్యసేన్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌

Lakshya Sen
Lakshya Sen

కౌలాలంపూర్‌: భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. బిడబ్యూఎఫ్‌ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఒకేసారి తొమ్మిది స్థానాలను అధికమించి 32వ ర్యాంక్‌కు చేరాడు. ఇది అతడి కెరీర్‌లోనే ఉత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. మొత్తం ఏడు టోర్నీల్లో బరిలోకి దిగిన అతడు ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. డచ్‌ ఓపెన్‌, సార్‌లార్‌లక్స్‌ ఓపెన్‌, స్కాటిష్‌ ఓపెన్‌, బెల్జియం ఇంటర్నేషనల్‌, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ లలో విజేతగా నిలిచాడు. భారత షట్లర్లలో సాయి ప్రణీత్‌(11). కిదాంబి శ్రీకాంత్‌(12), కశ్యప్‌(23) ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మహిళల్లో పివి సింధు(6) టాప్‌-10లో నిలవగా సైనా నెహ్వాల్‌ 11 వ ర్యాంకులో ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/