వాయిదా పడ్డ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

హైదరాబాద్‌ : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో మార్చి 22న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్..వారం ఆలస్యంగా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.సినిమాలోని సన్నివేశాలపై కొంతమంది టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో..ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు సభ్యులు డైలామాలో పడ్డారు. ఈ చిత్రం సెన్సార్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. బుధవారం ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లనుండగా..సినిమాను పరిశీలించిన ఆ తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయనుంది.సెన్సార్ సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం మార్చి 29న విడుదలయ్యే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది

https://www.vaartha.com/news/movies/
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.