ప్రమోద్‌ మిత్తల్‌ను విడుదల చేసిన బోస్నియా అధికారులు

Lakshmi Mittal's brother Pramod Mittal
Lakshmi Mittal’s brother Pramod Mittal

బోస్నియా: వ్యాపార వేత్త లక్ష్మీమిత్తల్‌ సోదరుడు ప్రమోద్‌ మిత్తల్‌ను వారం క్రితం బోస్నియా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమోద్‌ మిత్తల్‌ను బోస్నియా అధికారులు విడుదల చేశారు.12.5 మిలియన్ల యూరోలను చెల్లించిన తర్వాతే ఆయన్ను విడుదల చేశారు. బోస్నియాలోని కోకింగ్‌ప్లాంట్‌ నుంచి 200515 మధ్యలో 12 మిలియన్‌ డాలర్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు తేలడంతో అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
బోస్నియాలో అత్యంత పెద్ద ఎగుమతిదారుగా ఉన్న జీఐకేఐఎల్‌ కంపెనీకి ప్రమోద్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్‌తో పాటు కంపెనీ జనరల్‌ మేనేజర్‌ పరమేశ్ భట్టాచార్య, బోర్డు సభ్యుడు రజీబ్‌ డాశ్‌ను సైతం అదుపులోకి తీసుకొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/