జూన్ చివరి నాటికి హస్తినలో లక్ష కరోనా కేసులు!?

రోజుకు వెయ్యికిపైగా పాజిటివ్‌

thermal scanning
thermal scanning

New Delhi: కరోనా వ్యాప్తికి ఢిల్లీ విలవిల్లాడుతోంది.  రోజుకు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది.

తాజాగా గడచిన 24గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1320 పాజిటివ్‌ కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,654కి చేరింది. ఇప్పటివరకు 761మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉంది.

అయితే, ఈ కేసుల సంఖ్య జూన్‌ చివరినాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీవ్రతను అంచనా వేయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై ఐదుగురు వైద్య నిపుణలుతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/