రాజకీయాల్లో కొరవడుతున్న హుందాతనం

అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షపార్టీల నేతలు కలిసి మెలిసి మాట్లాడుకోవడం చూశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నవ్ఞ్వకుంటూ మాట్లాడుకున్న దృశ్యాలు చూశాం. ప్రతిపక్షనేత అటల్‌బిహారి వాజ్‌పేయి, కాంగ్రెస్‌ పార్టీకి, ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకి. ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శి స్తుండేవారు. ఆయన మూత్రపిండాల సమస్యలతో బాధపడు తున్న సమాచారం

Political Leaders

తెలుసుకుని ఆయనకు అమెరికాలో అత్యు త్తమ చికిత్స చేయించే సంకల్పంతో అమెరికా వెళ్లే పార్లమెంటరీ కమిటీ బృందంలో సభ్యుడిగా చేర్చి కిడ్నీలు బాగుచేయించిన ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ విశాలహృదయాన్ని గూర్చివిన్నాం. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపి వాజ్‌పేయి ఉపన్యాసాన్ని విని ముగ్ధుడై ఎప్పటికైనా ఇతడు భారతదేశానికి ప్రధానమంత్రి అవ్ఞతాడు అని ప్రశం సించారు.

పాకిస్థాన్‌ యుద్ధంలో జయించి బంగ్లాదేశ్‌ దేశాన్ని ప్రపంచపటంలో పెట్టిన ఇందిరాగాంధీని అపర దుర్గామాత అని కీర్తించారట వాజ్‌పేయి. పివి నరసింహారావ్ఞ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లే ఒక భారత ప్రతినిధి బృందంతో ప్రతిపక్షనేత అటల్‌బిహారి వాజ్‌పేయిని కూడా పంపించారు. అలాగే వాజ్‌పేయిని తన గురువ్ఞ అని బహిరంగంగా చెప్పే వారు పివి. సోనియాగాంధీని ఎంత విమర్శించినా తానేదైనా పుస్తకాన్ని ప్రచురిస్తే ఎల్‌కె అద్వానీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆ పుస్తకాలను బహూకరించేవారు!

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నాటి మహానేతలు టంగుటూరి ప్రకాశం పంతులు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావ్ఞ, జలగం వెంగళరావ్ఞ, మర్రిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, వావిలాల గోపాలకృష్ణయ్య, చెన్నమనేని రాజేశ్వరరావ్ఞ, నర్రారాఘవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం లాంటి మహామహులు ఎందరో హుందాతనానికి మారుపేరుగా ఖ్యాతి గడించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ, నోరుజారేవారు కారు. అసభ్యపదాలు నోటివెంట వచ్చేవికావ్ఞ. రాజకీయంగా విమర్శలు చేసుకునేవారు తప్ప పోలీసులను, ప్రభుత్వ అధికారులను నిందించడం, బెది రించడం చేసేవారుకారు.

అదంతా గతవైభవంగా మిగిలిపోయిం ది.గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో పెద్దరికం, హుందా తనం అదృశ్యమైపోయాయి.ప్రతి చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం, ప్రత్యర్థులను దూషించడం, వ్యక్తిగత దాడులు చేయడం, హత్యలు, పగప్రతీకారాలు, కొట్టుకోవడాలు, రాజకీ యాల్లో ప్రవేశించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పే పార్టీలు అధికారంలోకి రాగానే తమగతులు తప్పుతున్నాయి. అది మంచి పద్ధతికాదు అని ఎవరైనా చెప్పబోతే అప్పుడు వారు అలా చేయలేదా? ఇప్పుడు మేము చేస్తే తప్పేంటి? అని నిలదీస్తున్నారు.

మూడేళ్ల క్రితం నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి విశాఖపర్యటనకు వెళ్లినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని, ఆయన అనుచరులను విమానాశ్రయంలోనే అడ్డుకు న్నారు.ఎంత చెప్పినప్పటికీ నగరంలోకి అనుమతించలేదు. కాసేపు ధర్నాచేసిన పిదప జగన్మోహన్‌రెడ్డి బృందాన్ని అటు నుంచి అట్టే హైదరాబాద్‌ విమానం ఎక్కించారు పోలీసులు. మొన్న నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అదే అనుభవం ఎదు రైంది. విశాఖపట్నంలో ఏదో చైతన్య యాత్రకు హాజరు అవడా నికి వెళ్లిన చంద్రబాబును వైసిపి కార్యకర్తలు సాధారణ ప్రజలు విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు అడుగుపెట్టనీయలేదు. ఇచ్చిన అనుమతిలోని నిబంధనలను పాటించలేదు.

కాబట్టి అనుమతి రద్దు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. డెబ్భై ఏళ్ల వయసు, పధ్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ అనుభవం, పదేళ్ల ప్రతిపక్షనేత అనుభవం మొత్తంగా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు పోలీసులతో వాగ్యుద్ధానికి దిగా రు. ఉద్రిక్తపరిస్థితులున్నాయని, బయటకు వెళ్లవద్దని పోలీసులు గంటలతరబడి బతిమాలినా వినలేదు. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే చర్చను పక్కనపెడితే అంతటి అనుభవం కలిగిన చంద్రబాబు ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని చెప్పాలి.

-ఇలపావులూరి మురళీమోహనరావు, (రచయిత:సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/