‘చెలి’ కానుక

Bath
Bath

ఉమ్మెత్త ఆకు సమపాళ్లలో తీసు కుని కలిపి మర్ద న చేస్తే అరికాళ్ల మం టలు తగ్గి పోతాయి.
కొబ్బరినూనెలో వెల్లుల్లి ఉడికించి, తర్వాత వడకట్టి ప్రతిరోజు తలకు రాస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి.

మందుసీసాల కార్కులు రాకపోతే వాటిపై కాస్త గ్లిజరిన్‌ రాస్తే వెంటనే ఊడివస్తాయి. లెదర్‌ పర్సులు, బ్యాగులను నీరుల్లిపాయలతో రుద్దితే నిగనిగలాడుతూ ఉంటాయి.

పట్టుచీరలో చిన్న జరీ ముక్క తీసుకుని దాని మధ్యకు తెంపినప్పుడు జరీలోని మధ్యదారం ఎర్రపోగు అయితే అది అసలు జరీ, తెల్లపోగు వస్తే అది నకిలీ అన్నమాట.

వడియాల పిండిలో, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి వడియాలు పెడితే ఎండిన తరువాత వాటిని వేయించితే పెద్దవిగా పొంగుతాయి.

మిరపపొడి మంచి వాసనగా ఉండాలంటే, ఎండుమిర్చిని వేయించే సమయంలో నూనె కొద్దిగా వేయాలి.
నిమ్మకాయను మరుగుతున్న నీటిలో వేసి కొన్ని సెకన్లు ఉంచి, తీసి పిండితే రెట్టింపు రసం వస్తుంది.

టేబుల్‌ స్పూన్‌ మిరియాలు నేతిలో వేయించి, చిన్న నిమ్మకాయంత బెల్లం వేసి నూరి చిన్న ఉండలు చేసి రోజు వేసుకుంటే జలుబు తగ్గుతుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/