చింత తీరనిది..

LADY111
LADY

చింత తీరనిది..

మానసిక వైద్యశాస్త్రం వృద్ధిలోకి వచ్చి దశాబ్దాలు గడిచినా, దిగులుకు అసలు కారణం డిప్రెషన్‌ అను సత్యం ఇంకా చాలా మందికి చేరనేలేదు. డిప్రెషన్‌లో ఉన్నవారికి ఏకాగ్రత బాగా తగ్గిపోతుంది. జీవితం పట్ల ఆసక్తి కోల్పోవడంతో పాటు, ఆత్మహత్యకు పాల్పడే అవకాశమూ ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్‌కు గురైన వారిలో దాదాపు 15శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి, ఆరోగ్యవంతమైన మేధస్సుకు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉంటాయి. అవి జీవితంలోని కష్టాలనూ, నష్టాలన్నిటినీ ఏదో ఒక దశలో అధిగమించగలుగుతాయి. అయితే డిప్రెషన్‌లో ఉన్నవాళ్లే ప్రతి చిన్న సమస్యకూ జీవిత సమస్యలకూ, డిప్రెషన్‌కు ఏ సంబంధమూ లేదు. జీవితంలో ఏ సమస్యా లేనివారు కూడా ఎంతో మంది డిప్రెషన్‌కు గురవ్ఞతారు. డిప్రెషన్‌ అన్నది మెదడులో జరిగే న్యూరోట్రాన్స్‌మీటర్లలో వచ్చే తేడాలతో తలెత్తే సమస్య. ఇది పూర్తిగా మెడికల్‌ సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి మందులు వాడవలసిందే. అందుకే జీవిత సమస్యలతో ముడిపెట్టి, డిప్రెషన్‌ బాధితులను వైద్యచికిత్సలకు దూరంగా ఉంచకూడదు. వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించడంలో ఏమాత్రం జాప్యం చేయకూడదు.