మహిళల భూషణాలు

Hair sticks

ప్రాచీనాలంకారికులు స్త్రీల భూషణాలను 16 రకాలుగా వర్గీకరించారు. అవేవో తెలుసుకుందామా!
శిరోభూషణాలు: శిఖాపాశం, శిఖావాల్యం (ఇవి కొప్పుచుట్టూ అలంకరించుకునేవి). శిఖాజాలం, పిండీపత్రం (ఇవి నాగరాల వంటివి) చూడామణి (శిరోమధ్యాన ధరించేది) మకరిక (చిన్న మొసలి ఆకారంలోని ఆభరణం) ముక్తాజాలం, గవాక్షకం (నుదుటి మీద పాపిట నుండి చెవ్ఞల పై భాగం దాకా అలంకరించుకునేవి. ఇప్పుడివే పాపిటసెట్లుగా ప్రసిద్ధం. శీర్షజోలకం. శిఖిపత్రం.
వేణీభూషణాలు: జడ, జడచుట్టూ అలంకరించుకునేవి. ఇవి కండకం,శిఖాపత్రం, దోరకం అని మూడు రకాలు.
అలాల భూషణం: అనేక రకాలుగా అలంకరింపబడే తిలకం. ఇది కనుబొమల మధ్య, కొంచెంపైన పుష్పగుచ్ఛంలా అలంకరింప బడుతుంది.
కర్ణభూషణాలు: స్త్రీలలో అత్యధికులు ఇష్టపడే ఆభరణాలు చెవ్ఞలకు అలంకరించుకునేవే. వీటిలో కర్ణిక (దుద్దు). కర్ణవలయం, పత్ర కర్ణిక, కుండలం, కర్ణముద్ర, కర్ణోత్కీలకం, నానారత్న విచిత్ర దంత (ఏనుగుదంతాలతో చేసినవి) పత్రాలు, కర్ణపూరం- మొదలైనవి.
గండభూషణాలు: చెక్కిళ్లపై అలంకరించుకునే తిలకాలు, పత్ర లేఖలు (ఇవి ముత్యాలు, రత్నాలతోనూ అలంకరించుకోవడం కద్దు).
అంజన, రంజన కర్తవ్యాలు: కాటుక దిద్దుకోవడం, చెక్కిళ్లకు ఎరుపు రంగు నద్దుకోవడం, తాంబూల సేవనంతో నోటిని రాగ రంజితం చేసుకోవడం, దంతాలకు ధవళ, స్వర్ణకాంతుల నలుముకోవడం మొదలైనవి.
కంఠవిభూషణాలు: ముక్తావళి, వ్యాళపంక్తి (పాము వంటి వరుసలు) మంజరి, రత్నమాలిక, రత్నావళి సూత్రకం.
హారాలు: ద్విసర, త్రిసర, చతుస్సరాలు, శృంఖలిక (గొలుసు) మొదలైనవి.
బాహుమూల విభూషణాలు: అంగదం, వలయం.
వక్షోవిభూషణాలు: త్రివణి (ముప్పేటసరం) నానాలంకృత హారాలు.
స్తనవిభూషణం: వక్షోజాల చుట్టూ అల్లబడి ఉండే మౌక్తిక హారచయం.
అంగుళీ భూషణాలు: ఉంగరాలు. ఇవి. కలాపి, కటకం, శంఖం, హస్తపత్రం, పూరకం, ముద్ర అంగుళీయకం మొదలైనవి.
శ్రోణీ విభూషణాలు: నడుముపై అలంకరించుకునే నగలు. ఇవి కాంచి, మేఖల, రశన, కలాప, ముక్తాజాలాఢ్య తలకం మొదలైనవి. వీటిలో కాంచి ఒక వరుసను, మేఖల ఎనిమిది వరుసలను, రశన ఒక వరుసలను, కలాపం 25వరుసలను కల్గి ఉంటుంది. దేవతలు, రాజకాంతలు ధరించే ముత్యాలహారాలు 32 లేదా 64 లేదా 108 పేటలు కల్గి ఉండేవి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/