ఆక్సిజన్ ఇవ్వకుండా ఆపితే ఉరిశిక్ష

ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక

lack of oxygen-Delhi High Court is serious
lack of oxygen-Delhi High Court is serious

New Delhi: వైద్యశాలల్లో రోగుల‌కు ఆక్సిజ‌న్ అంద‌క‌పోవటం పట్ల ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు కేంద్ర స‌ర్కారు చర్యల తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త‌పై ప‌లు ఆసుప‌త్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేయగా వాటిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం., ఈ విష‌యంలో కేంద్ర స‌ర్కారు మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది.

రోగుల‌కు ఆక్సిజ‌న్‌ను అందించ‌క‌పోవ‌డం నేర‌పూరిత చ‌ర్య అని పేర్కొంది. జీవించ‌డం ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కు అని గుర్తు చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎవ‌రైనా ఆటంకాలు క‌లిగిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్లడించింది. ఆక్సిజన్ కొరత ఉందని ఎవరైనా చికిత్స తీసుకుంటున్న పేషెంట్ కి ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తే వారిని ఉరి తీస్తామని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. సొంతంగా ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/