డేవిడ్‌ బెకహామ్‌కు అరుదైన గౌరవం…

david beckham
david beckham, football player


ఇంగ్లాండ్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌కు అరుదైన గౌరవం లభించింది. మేజర్‌ లీగ్‌ 24వ సీజన్‌ సందర్భంగా డేవిడ్‌ బెక్‌హామ్‌ను లాస్‌ ఏంజిల్స్‌ క్లబ్‌ అరుదైన గౌరవంతో సత్కరించింది. డిగ్నిలీ హెల్త్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ బయిట బెక్‌హామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ సీజన్‌లో లాస్‌ ఏంజిల్స్‌ క్లబ్‌ ఆడిన తన తొలి మ్యాచ్‌లో చికాగో పైర్‌పై 2-1తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అయిన బెక్‌హామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించింది. లాస్‌ ఏంజిల్స్‌ గెలాక్సీ తరుపున ఆరు సీజన్లకు గాను డేవిడ్‌ బెకహామ్‌ 122మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు రెండుసార్లు మేజర్‌ లీగ్‌ సాకర్‌ కప్‌ ట్రోఫీని కూడా అందించాడు. గెలాక్సీ జట్టుతో డేవిడ్‌ బెకహామ్‌ జత కట్టడంతో ఈ లీగ్‌ పాపులారిటీ అమాంతం పెరిగింది. అంతేకాదు డేవిడ్‌ బెకహామ్‌ ఆడుతున్నాడని తెలిసి మరికొందరు అంతర్జాతీయ ఫుట్‌బాలర్లు ఈలీగ్‌పై ఆసక్తిని కనబర్చారు. మేజర్‌ లీగ్‌ కమిషనర్‌ డాన్‌ గార్బెర్‌ మాట్లాడుతూ ‘డేవిడ్‌ బెకహామ్‌ తీసుకున్న నిర్ణయంతోనే ఈరోజు లీగ్‌ ఇంతటి సక్సెస్‌ను సాధించింది అని అన్నారు. ఇంగ్లాండ్‌ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో డేవిడ్‌ బెకహామ్‌ ఒకడు. ఫిఫా ప్రపంచకప్‌లో బెకహామ్‌ నేతృత్వంలో ఇంగ్లాండ్‌ జట్టు 2006లో జరిగిన ప్రపంచకప్‌లో ఫైనల్స్‌ వరకు వెళ్లింది. యూరోపియన్‌ లీగుల్లో బెక్‌హామ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌, రియల్‌ మాడ్రిడ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్‌ జట్టు తరుపున మూడుసార్లు ప్రపంచకప్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.