కువైట్‌లో కరోనా కర్ఫ్యూలో సడలింపులు

kuwait-to-ease-coronavirus-curfew-from-sunday

కువైట్‌: క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ లో స‌డ‌లింపులు ఇవ్వాల‌ని కువైట్ కేబినెట్ నిర్ణ‌యించింది. ఆదివారం నుంచి క‌ర్ఫ్యూ వేళలు రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఉంటాయ‌ని మంత్రివ‌ర్గం ప్ర‌క‌టించింది. ఇక సాధార‌ణ జీవ‌నం వైపు అడుగులేస్తున్న కువైట్ ఐదు ద‌శ‌ల్లో దీనిని విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక వేసింది. కువైట్‌లో గురువారం 541 కొత్త కేసులు న‌మోదు కాగా… వీరిలో 283 మంది కువైట్ పౌరులు, 258 మంది ప్ర‌వాసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ తెలిపింది. మ‌రో 616 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 38,074 మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా… 29,512 మంది కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా 8,254 యాక్టివ్ కేసులుండ‌గా… 188 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. కాగా, కువైట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 308 మంది కరోనాతో మృతిచెందారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/