రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టాము

భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలుగా మారాలి

kurasala kannababu
kurasala kannababu

అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, వచ్చే మే నెలలోపు అన్ని ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలుగా కూడా మారాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ పటిష్టత కోసం కీలక చర్చ జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. సుబాబుల్‌, యుకలిప్టస్‌ ధర కోసం​ సహాయం అందించేందుకు కమిటీని ఏర్పాటు చేపినట్లు తెలిపారు. రైతులకు అందించే గిట్టుబాటు ధరను రైతు భరోసా కేంద్రాల్లో బోర్డుల ద్వారా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్కెట్‌ యార్డులు ఉంటాయని, మొదటిసారిగా గ్రామస్థాయిలో విత్తన సరఫరా జరగనుందని తెలిపారు. కాగా ధరల స్థిరీకరణ కోసం ప్రతీ వారం చర్చ, నిర్ణయాలు తప్పనిసరిగా ఉంటాయని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చయండి: https://www.vaartha.com/news/national/