బాబు కంచుకోటను బద్దలు కొట్టిన వైసీపీ

చంద్రబాబు కంచు కోట కుప్పం లో వైసీపీ విజయ డంఖా మోగిస్తుంది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డులో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 12 స్థానాల్లో స్పష్టతమైన ఆధిక్యతతో విజయం సాధించింది. తొలి రౌండ్ లో మొత్తం 14 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. కాగా, వైసీపీ కుప్పం మున్సిపాల్టీ పైన వైసీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది. కమలాపురంలోనూ వైసీపీ విజయం సాధించింది. దాచేపల్లిలో 11 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొంది..మున్సిపాల్టీలపైన జెండా ఎగుర వేసారు. దర్శి మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకుంది. గురజాలోనూ వైసీపీ విజయం సాధించింది. గురజాలలో వైసీపీ 16… టీడీపీ 3..జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. పల్నాడులో ఎన్నికలు జరిగిన రెండు మున్సిపాల్టీలు ఇప్పుడు వైసీపీ ఖాతాలో చేరాయి. నెల్లూరు లో ఏకపక్షంగా వైసీపీ దూసుకెళ్తోంది. ఇక, నెల్లూరు కార్పోరేషన్ లోనూ వైసీపీ ఆధిక్యంలో ఉంది.

మొత్తం 54వార్డులకు గాను.. ఇప్పటి వరకు 36వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాల్టీని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాల్లో వైసీపీ 17 గెలవగా.. టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ సైతం వైసీపీ దక్కించుకుంది. ఈ మున్సి పాల్టీలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ ఇప్పటికే 12 వార్డుల్లో విజయం సాధించింది.