ఈరోజు కుప్పం రంగు మారిందిః మంత్రి రోజా

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎగిరే జెండా కూడా మారుతుందని వ్యాఖ్య

kuppam-colour-is-changed-says-roja

కుప్పంః సిఎం జగన్‌ కుప్పం పర్యన నేపథ్యంలో కుప్పం పట్ణణం వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులతో నిండిపోయింది. రోడ్డుకిరువైపులా వైఎస్‌ఆర్‌సిపి జెండాలు, జగన్ ఫ్లెక్సీలు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… జగన్ కు కుప్పం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇది కుప్పంలా లేదని… పులివెందులలా ఉందని చెప్పారు. ఈరోజు కుప్పం రంగు మారిందని… వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎగిరే జెండా కూడా మారుతుందని అన్నారు.

కుప్పం నుంచి కురుపాం వరకు… చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వైసీపీ జెండా మాత్రమే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు వైఎస్‌ఆర్‌సిపినే గెలిపించారని చెప్పారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిదాన్ని… మూడేళ్లలో జగన్ చేసి చూపించారని అన్నారు. వైయస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల జీవితాల్లో జగన్ వెలుగులు నింపారని కొనియాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/