ఏఐసిసి అధ్యక్షుడిగా రాహులే కొనసాగాలి!

పిసిసి చీఫ్‌గా ఉత్తమ్‌ కొనసాగుతారు

kuntia
kuntia

హైదరాబాద్‌: ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ కొనసాగాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాహుల్‌ మంచి ఫైటర్‌ అని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 34 శాతానికి పెంచాలని కుంతియా డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహరచనకు పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కమిటీ వేస్తామన్నారు. జులై మొదటివారంలో ఎంపిటిసి, జెడ్పీటిసిల సమావేశం జరుగుతుందన్నారు. నూతన పిసిసి చీఫ్‌ నియామకంపై ఇంకా చర్చించలేదని, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిసిసి చీఫ్‌గా కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/