అధికార పక్షానికి గురువారమే విశ్వాసపరీక్ష!

CM Kumaraswamy
CM Kumaraswamy

బెంగాళూరు: కర్ణాటక సిఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకు స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చారు. ఈ నెల 18న (గురువారం) ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
జేడీఎస్‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా.. స్వయంగా కుమారస్వామే బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని భాజపా పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష పెడతామని, అందుకు అధికార పక్షం సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/