ఇకనైనా కుమారస్వామి రాజీనామా చేయాలి

Yeddyurappa
Yeddyurappa

బెంగాళూరు: ఎమ్మెల్యేల బలం తగ్గిపోతున్నప్పటికీ కుమారస్వామి ఎందుకు రాజీనామా చేయడం లేదనికాంగ్రెస్‌ నేత, మంత్రి శివకుమార్‌ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డా ప్రతిపక్ష నేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతు సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరిపైనా అనర్హత వేసే అధికారం స్పీకర్‌కు లేదు. కూటమికి ఎమ్మెల్యేల బలం తగ్గిపోతోంది. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేయడం మంచిది. ఆయనకు నేనిచ్చే సలహా ఇదే. కూటమి ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా భాజపాకే మద్దతిస్తున్నారు. బీఏసీ సమావేశంలో మీకు మరో సలహా ఇవ్వబోతున్నాను అని తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/