తీహార్‌ జైలులో డికెశివకుమార్‌ను కలిసిన కుమారస్వామి

kumaraswamy
kumaraswamy

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసు ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్‌ ఇడి విచారణ ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేడయంలో శివకుమార్‌ కీల పాత్ర పోషించారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచిన శివకుమార్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. కానీ రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి రాష్ట్రంలో హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వం పడిపోయి యెడియూరప్ప అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి తీహార్‌ జైలుకు వెళ్లారు. అక్కడ డికె శివకుమార్‌ను కలిసారు. కర్ణాటకలోని రాజకీయ అంశాలపై కుమారస్వామి, శివకుమార్‌తో చర్చించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/