రికార్డుకు వికెట్‌ దూరంలో కుల్దీప్‌ యాదవ్‌

Kuldeep Yadav
Kuldeep Yadav

కటక్: వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగే మూడో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తాడు. మహ్మద్ షమి 56 వన్డేల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగే మూడో వన్డే కుల్దీప్‌కు 56వది కావడం విశేషం. ఇప్పటివరకు వన్డేల్లో కుల్దీప్ యాదవ్ 99 వికెట్లు తీశాడు. కటక్ వన్డేలో మరో వికెట్‌ సాధిస్తే వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత 22వ బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/